స్వతంత్రంగానే పోటీ
రాయలసీమలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కడప జిల్లా మైదుకూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు.
ఎన్నికల వేళ కడప జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెదేపాలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ.. ఆయన మైదుకూరు నుంచి స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహశివరాత్రి తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా.... ఒంటరిగానైనా పోటీ చేస్తానని డీఎల్ అన్నారు. తెదేపా నుంచి మైదుకూరు అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్కు సీటు ఖరారైన నేపథ్యంలో రవీంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అనుచరగణంతో భేటీ అనంతరం కార్యచరణ ప్రకటిస్తానని డీఎల్ వెల్లడించారు.