ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుదిరిన డీల్ .. వైకాపాలోకి డీఎల్..! - dl ravindra reddy into ysrcp

కడప జిల్లా సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైకాపా సీనియర్ నాయకులు తనను కలిసిన అనంతరం.. ఈ ప్రకటన చేశారు. జగన్ నాయకత్వంలో నూతన ఒరవడి సృష్టిస్తామని చెప్పారు.

వైకాపాలో చేరనున్న డీఎల్ రవీంద్రారెడ్డి...ఫలించిన నేతల మంతనాలు

By

Published : Mar 20, 2019, 3:48 PM IST

Updated : Mar 20, 2019, 5:06 PM IST

వైకాపాలో చేరనున్న డీఎల్ రవీంద్రారెడ్డి...ఫలించిన నేతల మంతనాలు
త్వరలోనే వైకాపాలో చేరుతున్నట్లు కడప జిల్లా సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేస్తానన్నారు. కడప జిల్లా ఖాజీపేటలో ఈరోజు వైకాపా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్ రెడ్డి.. డీఎల్​ను కలిశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ కు అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు.

మైదుకూరు నుంచి తెదేపా టిక్కెట్టు రాకపోవడంతో డీఎల్ తీవ్ర అసంతృప్తి చెందారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన.. తెదేపాలోకి వెళ్లి పోటీపై ఆసక్తి కనబరిచారు. టికెట్టు విషయంలో అధిష్ఠానం నుంచి హామీ రాని కారణంగా.. పార్టీ మారేందుకు నిర్ణయించారు.

Last Updated : Mar 20, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details