ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వివేకా హత్య కేసులో... వారి ప్రమేయాన్ని కప్పిపుచ్చేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారు!" - AP News

DL Ravindra Comments on CBI: వివేకా హత్య కేసులో వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రా రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరన్న డీఎల్.. సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని అభిప్రాయపడ్డారు.

DL Ravindra Comments on YS Viveka Murder Case
DL Ravindra Comments on YS Viveka Murder Case

By

Published : Mar 12, 2022, 3:24 PM IST

DL Ravindra Comments on CBI: వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సజ్జల విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

వివేకా హత్య కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందన్న ప్రచారంపై సీబీఐ నిగ్గు తేల్చాలని కోరారు. పులివెందులలో వైకాపా నేతల ప్రమేయంపై ప్రచారం జరుగుతోందని అన్నారు. బాబాయి హత్యకు గురైతే జగన్‌ సాయంత్రం చేరుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

వివేకా హత్యకేసును సునీత కుటుంబంపై నెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కేసులో సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:CBI: ఉమాశంకర్​రెడ్డికి బెయిల్​ ఇవ్వొద్దు.. సీబీఐ కౌంటర్ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details