కడప జిల్లాకు చెందిన యువతి దిల్లీలో అపాయంలో ఉండగా దిశ యాప్ ద్వారా పోలీసులు ఆమెను రక్షించారు. ఈనెల 11న ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం జిల్లాకు చెందిన సుభాషిణి రైల్లో దిల్లీకి వెళ్లింది. పరీక్షా కేంద్రానికి ఆటోలో వెళ్తుండగా.. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చింది. అతని మాటలు, చేష్టలతో భయపడి.. ఆటో దిగి రైల్వేస్టేషన్‌లోకి పరెగెత్తింది. వెంటపడిన ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకుంది. ఈ సమయంలోనే భయంతో తన వద్దనున్న సెల్ ఫోన్లో దిశ యాప్‌లోని ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కింది.
DISHA APP: ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి బయటపడింది - ఏపీ టాప్ న్యూస్
రాష్ట్రానికి చెందిన యువతి దిల్లీలో అపాయంలో ఉండగా దిశ యాప్ ద్వారా కడప పోలీసులు రక్షించారు. రెండ్రోజుల పాటు ఆమెకు అండగా ఉండి.. పరీక్ష రాసి ఇంటికి చేరేవరకు కంటికి రెప్పలా కాపాడారు.
ఒక్క క్లిక్ చేసింది.. అపాయం నుంచి తప్పించుకుంది..!
వెంటనే కంట్రోలు రూం నుంచి కడప ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీకి సమాచారం వెళ్లింది. యువతితో మాట్లాడిన కడప పోలీసులు.. ధైర్యం చెప్పారు. దిల్లీ పోలీసుల సాయంతో యువతిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి.. పరీక్ష రాసి తిరిగి కడప వచ్చే వరకు పోలీసులు రక్షణగా ఉన్నారని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దిల్లీకి ఒంటరిగా వెళ్లిన తనకు దిశ యాప్ ద్వారా పోలీసులు ఆపద నుంచి రక్షించారని సుభాషిణి అనే యువతి మీడియా ముందు వివరించింది.
Last Updated : Sep 14, 2021, 4:57 PM IST