ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి' - కడప తాజా వార్తలు

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తలు సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఉద్యమం చేస్తామని అన్నారు.

Dharna in front of Kadapa Collectorate
ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

By

Published : Dec 17, 2020, 10:58 PM IST

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టార. ఆశా వర్కర్లకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో మరణించిన ఆశా కార్యకర్తలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఉద్యమం చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:పెన్నా నదిలో ఏడుగురు యువకులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details