ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ధన్వంతరి హోమం నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం సంక్షేమం బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ హోమం చేస్తున్నామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ప్రళయకాల రుద్రుడు వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరై.. పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు అధికారులు భగవంతుని ప్రార్థించారు.
వీరభద్రస్వామి ఆలయంలో ధన్వంతరి హోమం - latest news on corona virus
కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ధన్వంతరి హోమం చేశారు. ప్రళయకాల రుద్రుడు వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరభద్రస్వామి ఆలయంలో ధన్వంతరి హోమం