ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలు ఇవ్వకుండా దళిత కుటుంబాలను కడప రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ బాధితులు వాపోయారు. నిబంధన ప్రకారం తమకు రావాల్సిన ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. గతంలో 17 మంది దళితులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసిందని కానీ కొంతమంది రెవెన్యూ అధికారులు ఆ స్థలాలు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయంటూ తమకు అన్యాయం చేశారని వాపోయారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తక్షణం ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.