అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే... ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆక్షేపించారు. కడప నగరంలో మూడు రోజులు పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.
'అధికార వికేంద్రీకరణతోనే అన్ని జిల్లాల అభివృద్ధి' - ఆదిమూలపు సురేశ్ న్యూస్
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్