ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా - కడపలో కరోనా కేసులపై ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా రివ్యూ

ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. కడప నగరంలో కరోనా చర్యలపై పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

corona cases at kadapa
అధికారులతో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా సమీక్ష

By

Published : Jun 5, 2021, 11:04 AM IST

కడప నగరంలో కొవిడ్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్​ సురేష్‌బాబుతో కలిసి పోలీసు అధికారులతో సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేవిధంగా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజలు అనవసరంగా రహదారులపైకి రాకుండా, గుంపులుగా గుమికూడకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం అనవసరంగా రహదారుల మీద తిరిగేవారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. సమీక్షలో సీఐలు సత్యనారాయణ, మహమ్మద్‌ అలీ, అశోక్‌రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details