కడప జిల్లాలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.24.75 లక్షల చెక్కులను నగర మేయర్ సురేష్ బాబుతో కలసి బాధితులకు ఆయన అందజేశారు.
పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలవెన్నంటే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ముఖ్యమంత్రి ప్రతి పేదవాడిని ఆదుకుంటున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని రోగాలకు సీఎం సహాయ నిధి కింద పేదప్రజలకు ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.