కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. కడప మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 8 నుంచి 17వరకు నగరంలో మాంసం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.
'కడపను కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి'
కరోనా రహిత పట్టణంగా కడపను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కోరారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 8 నుంచి 17వరకు కడపలో మాంసం విక్రయాలు నిలిపివేస్తామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో తహసీల్దార్ అనుమతి పొందిన తోపుడుబండ్ల వారు మాత్రమే నిత్యావసర వస్తువులు విక్రయించాలని ఆదేశించారు.
కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం
కంటైన్మెంట్ జోన్లలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు అంజాద్ బాషా తెలిపారు. ఈ జోన్లలోని వారు ఎవరు బయటకు వెళ్లకూడదని చెప్పారు. నిత్యావసర సరకులు మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్లలో స్థానిక తహసీల్దార్ అనుమతి పొందిన తోపుడుబండ్ల వారు మాత్రమే కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయించాలని ఆదేశించారు.