ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బోటు ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది' - amzad bhasa

గోదావరిలో కొన్ని ప్రైవేటు బోటు యాజమాన్యాలు లైసెన్సు లేకుండా నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని... వాటిపై నిఘా పెంచుతామని ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా స్పష్టం చేశారు. కడపలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన బోటు ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరగణిస్తోందని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి

By

Published : Sep 16, 2019, 9:35 PM IST

'బోటు ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది'

తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునిగి 47 మంది గల్లంతైన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. ఇప్పటికే బోటు సర్వీసులన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రద్దు చేశారని... మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కడపలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంజద్​ బాషా.. కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలో కొన్ని ప్రైవేటు లాంచీలు లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని... ఇలాంటి వాటిపై నిఘా పెంచుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details