రెండోసారి పెద్ద దర్గాకు చాదర్ సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి... ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రభుత్వ లాంఛనాలతో పెద్ద దర్గాకు చాదర్ సమర్పించారు. దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుసేనీ కలెక్టర్, ఉప ముఖ్యమంత్రికి తలపై చాదర్ పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన ఉప ముఖ్యమంత్రి - కడప పెద్ద దర్గా ఉత్సవాలు
కడప పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, జిల్లా కలెక్టర్ హరికిరణ్తో కలిసి చాదర్ సమర్పించారు.
కడప పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన ఉప ముఖ్యమంత్రి
కరోనా నేపథ్యంలో కేవలం 200 మందితో మాత్రమే ఉరుసు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాది అట్టహాసంగా జరిగే ఉరుసు మహోత్సవాలు ఈ ఏడాది కొవిడ్ కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించానని తెలిపారు.
ఇదీ చదవండి:'ఆవు’నాభావ బంధం