గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షక కార్యదర్శులు ఇక నుంచి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులతో కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటై ఏడాదిన్నర దాటినా.. పోలీసులకు సహకారం అందించేందుకు నియమించిన మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇప్పటివరకు ఏం చేయాలో జాబ్‌చార్ట్ పొందుపరచలేదన్నారు. ఇక నుంచి వారు ఎలాంటి సమాచారం సేకరించాలనేది వివరించారు. గ్రామ సచివాలయాల పరిధిలో ఏ కుటుంబంలో చిన్న సంఘటన జరిగినా.. మహిళలకు ఇబ్బందులు తలెత్తినా.. పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు మహిళా సంరక్షణ కార్యదర్శులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. కుటుంబాలకు సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు.
'మహిళా సంరక్షక కార్యదర్శుల సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి'
గ్రామ సచివాలయాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులు.. కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శులతో కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
young man murderd