ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2020, 11:39 PM IST

ETV Bharat / state

'ఆయనకు ఆ వైరస్ సోకినందువల్లే ఎన్నికలు వాయిదా'!

స్థానిక సంస్థ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తప్పుబట్టారు.

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయటంపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విరుచుకుబడ్డారు. కరోనా వైరస్ సాకుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు. కనీస అవగాహన లేకుండా ఎసీఈసీ ఎన్నికలను వాయిదా వేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి విఘాత చర్యలు జరగకపోయినప్పటికీ ఎన్నికలను నిర్వహించటకపోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ నెల 15న విడుదల చేసిన ప్రకటనలో అన్ని రాజకీయ పార్టీల సలహా మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతోనే ఎన్నికల కమీషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విషయంపై అధికార పార్టీకి ఎలాంటి ఆహ్వానం లేదని గుర్తు చేశారు. రమేష్ కుమార్​కు చంద్రబాబు అనే వైరస్ సోకినందువల్లే ఎన్నికలు వాయిదా వేశారని ఆక్షేపించారు.

ఇవీ చదవండి

'ఎన్నికల మీద ఉన్న ధ్యాస కరోనా నియంత్రణ మీద లేదా?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details