ఘనంగా కమలాపురం దర్గా ఉరుసు.. హాజరైన డిప్యూటీ సీఎం - kamalapur dargha news
కమలాపురం దర్గా ఉరుసు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హాజరయ్యారు. ఎంతో మహిమ కలిగిన దర్గాను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.

kamalapur urusu
వైయస్ఆర్ జిల్లా కమలాపురం దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. వారికి దర్గా పీఠాధిపతి, ఉరుసు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్గాలో మజార్లపై పూల చాదర్‌లు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి ఫైజల్ గఫార్ షా ఖాద్రీ... ఉరుసుకు వవచ్చిన నాయకులకు ఆశీస్సులు అందించారు. ఎంతో మహిమ కలిగిన కమలాపురం దర్గాను సందర్శించడం పట్ల ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంతోషం వ్యక్తం చేశారు.