60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక ర్యాపిడ్ టెస్ట్‌లు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పీహెచ్‌సీలకు 200 కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. శనివారం కడపలోని సాయిపేట హరిజనవాడలో ఉపముఖ్యమంత్రి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతి పీహెచ్సీ పరిధిలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కరోనా పాజిటివ్ ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా 10 నుంచి 15 నిమిషాలలో కరోనా వ్యాధిని నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. రెడ్ జోన్ ప్రాంతంలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు, విరేచనాలు ఉన్నవారు పది రోజుల తర్వాత ర్యాపిడ్ టెస్ట్‌లు చేయించుకుంటే కరెక్ట్‌గా ఫలితాలు వస్తుందన్నారు. కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ పరీక్షలు వేగవంతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష చేయించుకున్నారు.
'60 ఏళ్లు పైబడిన వారు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి' - ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తాజా వార్తలు
కడప సాయిపేట హరిజనవాడలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సందర్శించారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ టెస్టులు చేయాలన్నారు. ఈ టెస్ట్‌ల ద్వారా 10 నుంచి 15 నిమిషాలలో కరోనా వైరస్ వ్యాధిని కనిపెట్టవచ్చని తెలిపారు.
రాపిడ్ టెస్ట్ చేయించుకుంటున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష్