కడప జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన నూతన హోటల్‌ను.. చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానంలతో కలిసి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రారంభించారు. అనంతరం బోస్‌నగర్ ఠాణా కూడలిలోని జామియా మసీదులో ప్రార్థనలు చేశారు. మైనార్టీల సమస్యలపై ముస్లిం నాయకులతో చర్చించారు.
'మైనారిటీ యువకులపై అక్రమ కేసులు ఎత్తేయడంపై త్వరలో నిర్ణయం' - రాయచోటిలో హోటల్ ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. కడప జిల్లా రాయచోటిలోని ఓ హోటల్‌ను ప్రారంభించారు. బక్రీద్ సమయంలో మైనారిటీ యువకులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తేయడంపై.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం రచిస్తున్న ప్రణాళికలను వివరించారు.
హోటల్‌ను ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి
బక్రీద్ సమయంలో మైనారిటీ యువకులపై నమోదైన అక్రమ కేసులు తొలగించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని అంజాద్ బాషా తెలిపారు. త్వరలోనే మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జూనియర్ కళాశాల మైదానంలోని వక్ఫ్ బోర్డ్ స్థలంపై చర్చించారు. పట్టణ అభివృద్ధి కోసం చేపట్టనున్న చర్యలను వివరించారు. మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.