ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు రావాలి'

కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగరంలో ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన ఆయన...కరోనా రోగులకు వైద్యులు బాసటగా నిలవాలని సూచించారు.

deputy cm amjad basha
deputy cm amjad basha

By

Published : Aug 8, 2020, 9:58 PM IST

కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ముందుకు రావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు. ఎర్రముక్కపల్లి పరిసర ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. దీనిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం...కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రైవేటు ఆస్పత్రులు బాసటగా నిలవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలన్నూ కరోనా పేషెంట్​లకు వైద్యం అందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details