నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి - kadapa corona news
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తన నివాసంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు.
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి
కడప పట్టణంలోని వందమంది పాస్టర్లకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తన నివాసంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల గత 40 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. దీంతో పాస్టర్లనందరిని పిలిపించి నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.