పాత కడప చెరువు సుందరీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మున్సిపల్ అధికారులకు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పాత కడప చెరువు సుందరీకరణకు 55 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ఇందుకు సంబంధించి త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాజీ మార్గ్ రోడ్డు బ్యూటిఫికేషన్ కు సంబంధించి 3 కోట్ల 85 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల టెండర్ల పనులు త్వరగా జరిగేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు.
'త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించండి' - పాత కడప చెరువు సుందరీకరణ పనులు తాజా వార్తలు
కడప జిల్లా మున్సిపల్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్భాష సమీక్ష నిర్వహించారు. పాత కడప చెరువు సుందరీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులతో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ. అంజాద్భాష సమీక్ష
ఇవీ చూడండి...
TAGGED:
Cheruvu