కరోనా విపత్తు సమయంలో సేవలందించి వైరస్ బారినపడి మృతి చెందిన ఆర్టీసీ కార్మికులను సర్కారు ఆదుకుంటుందని ఉపముఖ్యమంత్రి అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కడప ఆర్టీసీ జోన్లో 22మంది..జిల్లా వ్యాప్తంగా 8 మంది కరోనాతో మరణించారని అధికారులు చెప్పారు.
కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు చెక్కుల పంపిణీ - rtc employees who died with corona news
కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. కడప జిల్లాలో కొవిడ్ కారణంగా మరణించిన కార్మికుని కుటుంబానికి సర్కారు తరఫున ఆర్థిక సాయం అందించారు.
చెక్కు అందజేస్తున్న ఉపముఖ్యమంత్రి
కడప ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న సాదక్‌వల్లి కరోనాతో మృతిచెందాడు. అతని కుటుంబానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, ఆర్టీసీ ఈడీ ఆదం సాహెబ్ ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. త్వరలో మిగతా కొవిడ్ బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. విధి నిర్వహణలో కార్మికులు వైరస్ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: వివేకా హత్య కేసు: హైకోర్టులో సీబీఐ అనుబంధ పిటిషన్