ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన 104, 108 వాహనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి అంజద్​బాషా - కడప నేటి వార్తలు

కడప జిల్లాకు కేటాయించిన నూతన 104, 108 వాహనాలు జిల్లాకు చేరుకున్నాయి. పట్టణంలోని కోటిరెడ్డి సర్కిల్ వేదికగా ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా.. జెండా ఊపి వాటిని ప్రారంభించారు.

Deputy Chief Minister Anjad Basha who launched the new 104 and 108 vehicles in kadapa
నూతన 104, 108 వాహనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి అంజద్​బాషా

By

Published : Jul 2, 2020, 5:14 PM IST

కడప జిల్లాకు నూతనంగా కేటాయించిన 87.. 108, 104 వాహనాలను ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. వీటిలో 104 అంబులెన్సులు 51, 108 అంబులెన్సులు 36, రెండు నీయోనాట్ వాహనాలు ఉన్నాయి. ప్రతి మండలానికి రెండు వాహనాలు ఉండే విధంగా ప్రభుత్వం కేటాయించిందని... జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమకూర్చిన ఈ వాహనాల ద్వారా ప్రజలకు సరైన సమయంయలో వైద్య సేవలు అందుతాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details