కడప జిల్లా ఇడమడక వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ... ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఉపాధి పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు కూలీలు రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా కాన్వాయ్ అడ్డగింత
కడప జిల్లా ఇడకమడకలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా కాన్వాయ్ అడ్డగింత
ఈ ఆందోళనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా.. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపగా.. వెంటనే పనులు మొదలుపెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ప్రత్యామ్నాయ మార్గంలో ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను పంపించారు.
ఇవీచదవండి.
పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం: మంత్రి సురేశ్
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కొవిడ్ పాజిటివ్
Last Updated : Apr 16, 2021, 8:42 PM IST