మన సంస్కృతి.. సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. కడపలోని వై జంక్షన్లో ఉన్న శివాలయంలో మాజీ మేయర్ సురేశ్‌బాబుతో కలిసి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండగను ఎంతో గొప్పగా చేసుకుంటారని అంజాద్ బాషా అన్నారు. కనుమ అంటే పశువుల పండగ అనీ.. ఈ రోజు పశువులను పూజించే కార్యక్రమం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.