ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సీఎం నమ్మకం : అంజాద్ బాషా

'వైఎస్ఆర్ రైతు భరోసా' కార్యక్రమానికి.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సహా ఇతర ప్రజాప్రతినిధులు కడప కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రైతు సంక్షేమం కోసం తపించే నేత సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. ప్రభుత్వ తోడ్పాటుతో రైతుల్లో వ్యవసాయం పట్ల మక్కువ పెరిగిందన్నారు.

deputy cm amjad basha in rythu bharosa
రైతు భరోసాలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

By

Published : May 13, 2021, 10:50 PM IST

రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. "వైఎస్ఆర్ రైతు భరోసా" కింద.. రైతులకు మూడో ఏడాది మొదటి విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్ నొక్కి .. రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేశారు. కడప కలెక్టరేట్ వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ హరికిరణ్​తో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ ఎం.గౌతమి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి:ఆ ఆస్పత్రిలో మరో 15 మంది కొవిడ్​ రోగులు మృతి

"రైతు భరోసా" కింద కర్షకులకు విడుదల చేసిన మొత్తాన్ని.. సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉపముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిదులు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం రూ. 224 కోట్ల 38 లక్షల 60 వేలను మెగా చెక్కు రూపంలో ఇచ్చారు. రైతుకు సాయం అందించడం ద్వారా.. వ్యవసాయంపై వారిలో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామాల్లో సాగుబడిని రైతులు పండుగ వాతావరణంలో చేపడుతున్నారన్నారు.

ఇదీ చదవండి:

కాన్సంట్రేటర్ల వితరణ.. ఉదారత చాటిన మిడ్ వెస్ట్ గ్రానైట్ మైనింగ్ సంస్థ

ABOUT THE AUTHOR

...view details