పసుపు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీ మార్క్ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కడప, మైదుకూరు, రాజంపేట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు మార్కెట్లో క్వింటా పసుపు ధర రూ.5 వేలు ఉండేదని.. ప్రభుత్వం మాత్రం క్వింటాను రూ.6850కు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రైతులెవ్వరూ అధైర్య పడవద్దని.. జిల్లాలో పండించిన పసుపును మొత్తం కొనుగోలు చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. మార్కెట్ యార్డులో పసుపును పరిశీలించిన మంత్రి.. కొందరు రైతులతో మాట్లాడి పంట వివరాలు తెలుసుకున్నారు.
కడపలో పసుపు పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు - పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అంజాద్ భాష
రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడపలో పసుపు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Deputy Chief Minister Amjad basha Established termeric Purchasing Center in Kadapa