హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి జేఎన్టీయూ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థినిని ఇసుక లారీ ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కడప జిల్లా బద్వేల్‌కు చెందిన ఆదిరష్మిగా గుర్తించారు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కడప విద్యార్థిని మృతి
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ వైద్య విద్యార్థిని మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కడప విద్యార్థిని మృతి
ఆమె హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో దంత వైద్య విద్య చదువుతోంది. రాత్రి సమయంలో మియాపూర్‌లో సినిమా చూసి వస్తుండగా... మెట్రో పిల్లరు 660 దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.