ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తతలకు దారితీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత - అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణ మార్కెట్​లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను పురపాలక శాఖ అధికారులు కూల్చివేయగా...భాజపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఉద్రిక్తతలకు దారితీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

By

Published : Oct 23, 2019, 7:01 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. పురపాలక శాఖ అనుమతిలేకుండా చట్టవిరుద్దంగా నిర్మించిన దుకాణాలను ఏర్పాటు చేయటంపై పురపాలకశాఖ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ...నిర్మాణాలను తొలగించారు. ఈ చర్యలపై మండిపడ్డ భాజపా నాయకులు కూల్చివేతలు ఆపాలంటూ..మార్కెట్​లో బైఠాయించి నిరసన తెలిపారు. దింతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు.

ఉద్రిక్తతలకు దారితీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details