Degree Student Suicide For Not Understanding Engish Medium :ఇంగ్లిష్ మీడియంలో చదువు అర్థం కాలేదని..చదువు సరిగ్గా అర్థం కాలేదని మనోవేదనతో బాధపడుతూ... ఓ డిగ్రీ విద్యార్థి (Student) ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప అశోక్ నగర్లో చోటుచేసుకుంది. కడప కేంద్రం అశోక్‌నగర్‌కు చెందిన సుమలతకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్ల కిందట భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సుమలత ముగ్గురు పిల్లలను తానే పోషించుకుంటుంది. సుమలత ప్రభుత్వ బాలికల వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తోంది.
స్నేహితులు మాట్లాడటం లేదని... యువకుని ఆత్మహత్య
Degree Student Suicide in Kadapa District :సుమలత మూడో కుమార్తె అయిన కేజీయా ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివింది. ఇప్పుడు కడప నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతోంది. కానీ కేజీయా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివిన కారణంగా... డిగ్రీ ఇంగ్లీష్ మీడియం ( english Medium ) కావడంతో సరిగ్గా చదవలేక, చదివింది అర్థం కాక మనోవేదనకు గురవుతుండేదని తన తల్లి సుమలత తెలిపారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య