కడపలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం..! - విద్యార్థిని మిస్సింగ్
వైఎస్సార్ జిల్లా కడపలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైంది. ఏప్రిల్ 24వ తేదీన కళాశాలకు వెళ్లిన విద్యార్థిని జాడ.. ఇప్పటి వరకూ కనిపించలేదు.

కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో.. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. కడప ఎర్రముక్కపల్లికి చెందిన 19 ఏళ్ల వయసున్న విద్యార్థిని.. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులోని తన అవ్వ ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అయితే.. పది రోజుల క్రితం విద్యార్థిని తదేకంగా ఫోన్ చూస్తుండగా అవ్వ మందలించింది. అప్పటి నుంచి విద్యార్థిని కడపలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ప్రతిరోజూ మైదుకూరుకు వెళ్లి వస్తూ ఉండేది. ఆ క్రమంలో.. ఏప్రిల్ 24వ తేదీన కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు బంధువుల నివాసాల్లో గాలించినా.. ఎక్కడా జాడ కనిపించలేదు. దీంతో.. విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.