ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ధర్నా - ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ధర్నా

ఫీజులు చెల్లించకుండా ఉత్తీర్ణత ధ్రువపత్రాలు ఇవ్వబోమన్న ప్రిన్సిపల్ చర్యల్ని నిరసిస్తూ ప్రొద్దుటూరు డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ధర్నా

By

Published : Aug 22, 2019, 2:38 PM IST

ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ధర్నా

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్​సిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఫీజురీయంబర్స్​మెంటు ఉన్నా ఫీజులు కట్టమంటున్న ప్రిన్సిపల్ తీరును నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రిన్సిపల్ గది ముందే నిరసనకు దిగినా ప్రిన్సిపల్ మాత్రం పట్టనట్లు సమాధానం చెప్తున్నారన్నారు. కళాశాలలో చేరే ముందు ఫీజులు కట్టనవసరం లేదన్న యాజమాన్యం ఇప్పుడు వేలకు వేల ఫీజులు కట్టమని వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కాలేజీలకు సైతం ఫీజురీయెంబర్స్​మెంట్లు అందుతుంటే ప్రభుత్వ కాలేజీ అయినా తమకు స్కాలర్​షిప్​లు గానీ, రీయంబర్స్​మెంటు గానీ రావటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధ్యాపకులు సరైన సమయానికి రాక, క్లాసులు సరిగ్గా అవ్వటం లేదని ప్రిన్సిపల్​కు ఫిర్యాదు చేస్తే ఇంట‌ర్న‌ల్ మార్కుల్లో కోత పెట్టి వేధిస్తున్నార‌ని విద్యార్ధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్​ను వివరణ కోరగా అసలు ఈ సమస్యలేవీ తమ దృష్టికి రాలేదన బాధ్యాతారాహిత్యంగా సమాధానం చెప్పారు. తను కేవలం ఇన్​ఛార్జ్ ప్రిన్సిపల్​ మాత్రమేనని తనకేమీ తెలియదంటూ ప్రిన్సిపల్ సమాధానాలు దాటవేశారు. కనీసం పైఅధికారులైనా తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : పెన్నాకు జలకళ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details