కడప జిల్లా పెన్నా నదిలో వరద ప్రవాహం తగ్గింది అనుకుని ఊపిరి పీల్చుకున్న కాసేపటికే,మళ్లీ పెన్నా ఉరకలేస్తోంది.గత రెండు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. 1.21లక్షల క్యాసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం నిన్నటికి62వేల క్యూసెక్కులకు చేరింది.హమ్మయ్య!అనుకునేలోపే,ఇవాళ మళ్లీ పెన్నా నదిలో వరద ప్రవాహం74వేల క్యూసెక్కులకు చేరింది.దీంతో నీటిపారుదల అధికార్లు అప్రమత్తం అయ్యారు.ఈ వరద నీరంతా నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి చేరుతోంది.ఈ జలాశయం గరిష్ట నీటిమట్టం78టీఎంసీలు కాగా,ప్రస్తుతం56టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.
ఉరకలేస్తోన్న పెన్నా..సోమశిలకు చేరుతున్న వరద నీరు - కడప జిల్లాలో పెన్నా నదిలో వరద తగ్గుతూ ఎక్కుతోంది
కడప జిల్లా పెన్నా నదిలో వరద తగ్గినట్లే తగ్గి, పెరుగుతోంది. ఈ వరద నీరు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి చేరుతోంది.
తగ్గుతూ..పెరుగుతున్న పెన్నా నది వరద ప్రవాహం