కడప జిల్లా గుండాలపల్లెకు చెందిన శివరామృష్ణ రెండు రోజుల క్రితం రైల్వేకోడూరులోని గుంజన నదిలో గల్లంతయ్యాడు. అతని మృతదేహం గురువారం తెల్లవారుజామున లభ్యమైంది. గల్లంతై రెండు రోజులైనా.. మృతదేహాన్ని బయటకు తీసేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదంటూ గుండాల పల్లె ప్రజలు రైల్వే కోడూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జేసీబీలతో నీళ్లను మళ్లించి... ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
రెండు రోజుల తర్వాత.. యువకుడి మృతదేహం ఆచూకీ లభ్యం - కడప జిల్లా తాజా వార్తలు
రెండు రోజుల క్రితం కడప జిల్లా రైల్వేకోడూరు గుంజన నదిలో గల్లంతైన యువకుడు మృతి చెందాడు. అతని మృతదేహం గురువారం తెల్లవారుజామున లభించింది. యువకుడి ఆచూకీ కోసం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు రాత్రంతా అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు.
రెండు రోజుల తర్వాత లభ్యమైన యువకుడి మృతదేహం