వైఎస్సార్ ఆసరా పథకం వారోత్సవాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కడపలోని లోహియానగర్‌కు వచ్చారు. వేదికవద్దకు వాహనం వెళ్లలేకపోవడంతో కొద్దిదూరం నడవాల్సి వచ్చింది. దారేమో మొత్తం బురదతో ఉంది. దీంతో ఉప ముఖ్యమంత్రి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు. ఓ చోట మార్గం అంతా బురదే ఉండటంతో గోడను పట్టుకొని దారిపక్కన ఉన్న మొద్దుపై కాళ్లుపెట్టి సర్కస్ ఫీట్లు చేశారు. ‘వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఇవే తిప్పలు సార్’ అని స్థానికులు తెలపగా 14వ ఆర్థిక సంఘం నిధులతో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఉపముఖ్యమంత్రికి తప్పని అడుసు పాట్లు! - ఉపముఖ్యమంత్రి తాజా వార్తలు
ఆ దారిమొత్తం బురదతో నిండిపోయింది. వాహనం వెళ్లలేని పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఈ దారిలోనే వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇలా ఫీట్లుచేస్తూ కనిపించారు. వర్షం వస్తే మాదీ ఇదే పరిస్థితి సార్ అంటూ అక్కడి స్థానికులు తెలిపారు.
dcm in damage roads