వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి వద్ద గన్‌మేన్‌గా విధులు నిర్వహించిన పుష్పరాజును సస్పెండ్ చేశారు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వాహనం కొనుగోలు చేశాడని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అన్బు రాజన్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వారాల కిందటి వరకు దస్తగిరి భద్రతలో భాగంగా గన్‌మెన్‌గా విధులు నిర్వహించిన పుష్పరాజు అవినీతి సొమ్ముతో స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేసినట్లు ఎస్పీ ఉత్తర్వులు పేర్కొన్నారు. ఆ డబ్బును సమకూర్చిన దస్తగిరే, ప్రస్తుతం ఆ వాహనాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారుల విచారణలో తేలిందన్నారు. గన్‌మెన్లను పదే పదే మార్చడంపై కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, పుష్పరాజును సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.
దస్తగిరికి గన్‌మేన్‌గా పనిచేసిన పుష్పరాజుపై సస్పెన్షన్ వేటు - Ap latest
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి వద్ద గన్‌మేన్‌గా విధులు నిర్వహించిన పుష్పరాజును సస్పెండ్ చేశారు. నెల రోజుల క్రితం సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా వాహానాన్ని కోనుగోలు చేశారని, ఆ వాహానానికి దస్తగిరే డబ్బును సమకూర్చినట్లు.. విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గన్‌మేన్ ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Dastagiri