కడపలో దసరా ఉత్సవాలు... కన్నుల పండువగా బిందె సేవ కడప జిల్లావ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చి అమ్మవారికి బిందె సేవ కార్యక్రమం నిర్వహించారు.
కమలాపురం
కమలాపురంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు బిందె సేవా కార్యక్రమం చేపట్టారు. 20 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శాల నుంచి రైల్వే గేట్ వరకు ఊరేగింపుగా వెళ్లారు.
రాజంపేట
శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రాజంపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరిదేవి అమ్మవారి బిందెసేవ కన్నుల పండువగా జరిగింది. పట్టణంలోని ఈడిగపాలెం నుంచి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారికి అడుగడుగునా నీళ్లు చల్లుతూ భక్తులు స్వాగతం పలికారు. అమ్మవార్ల వేషధారణలో డప్పు కళాకారులు ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి: కడపలో అంగరంగవైభవంగా.... దసరా ఉత్సవాలు