ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందూ నదిపై ప్రమాదకరంగా వంతెన - వంతెనను పట్టించుకోండి సారూ...

బ్రిటీష్ హయాంలో కడప జిల్లా చాపాడు మండలంలో సీతారామపురం వద్ద కుందూ నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నామని ప్రజలంటున్నారు. త్వరగా ఈ వంతెనను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు.

వంతెనను పట్టించుకోండి సారూ...

By

Published : Sep 24, 2019, 3:41 PM IST

Updated : Sep 24, 2019, 5:32 PM IST

కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందూ నదిపై నిర్మించిన వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వంతెన నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటారు. బ్రిటీషు హయాంలో నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు పెచ్చులూడి, ఇనుప కడ్డీలతో దర్శనమిస్తోంది. ప్రమాదకరంగా మారిన ఈ బ్రిడ్జిని అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వంతెనకు ఏర్పాటు చేసిన రక్షణ దిమ్మలు కొన్నిచోట్ల ఒరిగి ఉన్నాయనీ, వంతెనపై ప్రయాణించాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

వంతెనను పట్టించుకోండి సారూ...
Last Updated : Sep 24, 2019, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details