ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్న హత్యను ప్రభుత్వం హత్యగా పరిగణించాలి : దళిత హక్కుల పోరాట సమితి - సిట్టింగ్ జడ్జి చేత విచారణ

veterinary doctor Atchanna : కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్యను సిట్టింగ్​ జడ్జీ చేత విచారణ జరిపించాలని.. గతంలో దళిత సంఘాలు డిమాండ్​ చేసాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి దళిత హక్కుల పోరాట సమితి చేరింది. ఆయన మృతి కారణమైన వారిని విడిచిపెట్టి ప్రసక్తే లేదని దళిత పోరాట సమితి నాయకులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 1, 2023, 5:21 PM IST

Veterinary Doctor Atchanna Update : కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్యను.. ప్రభుత్వ హత్యగా పరిగణించాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఎద్దేవా చేశారు. అచ్చెన్నను ప్రభుత్వ అధికారులే పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్న హత్య కేసును.. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి అని డిమాండ్​ చేశారు. లేకపోతే సీబీఐకి బదలాయించాలని వారు కోరారు. కడప ప్రెస్ క్లబ్​లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అచ్చెన్న కలెక్టర్ తండ్రిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి అచ్చెన్నపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిందని పోరాట సమితి నాయకులు ఆరోపించారు.

అచ్చెన్న హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరినీ శిక్షించేంత వరకు.. ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. ఆనాడు మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్​ హత్యకు.. దారి తీసే విధంగా ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. నేడు అచ్చెన్నను కూడా ప్రభుత్వమే హత్య చేయించింది అని అన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే నిర్లక్ష్యంతోనే అచ్చెన్నపై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప వన్​టౌన్​ పోలీసుల నిర్లక్ష్యం అచ్చెన్న మృతిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత అధికారిని పొట్టన పెట్టుకున్న పాపం.. ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం దళితులనే లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉసిగొల్పుతున్నారని.. విమర్శించారు. అచ్చెన్న కుటుంబానికి న్యాయం చేయాలని.. వారికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని కోరారు. రాష్ట్రస్థాయి అధికారిపై కూడా కేసు నమోదు చేసి.. అందరిని శిక్షించాలని అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మంత్రి సీదిరి అప్పలరాజుతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వారికి రాలేదని అన్నారు. మృతికి కారణమైన వారిని శిక్షిస్తామనే హామీ ఇంతవరకు అందలేదన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ అందనందువల్ల.. వారు అన్ని ప్రజా సంఘాలతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఒక దళితుని మరణాన్ని రాజకీయం చేసి ఎక్కడ ఏం జరగిందనేది తెలియకుండా.. మొత్తం ఆధారాలను తుడిచిపెట్టారని మండిపడ్డారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details