ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడి కానుక అని నమ్మించి.. 12 లక్షలు కాజేశాడు! - కడప సైబర్ క్రైమ్ వార్తలు

విదేశాల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ సమాచారాన్ని నిజమని నమ్మి ఓ వ్యక్తి 12 లక్షల 85 వేల రూపాయలు అతని ఖాతాలో డిపాజిట్ చేశాడు. తర్వాత తెలిసింది మోసపోయానని.. ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.

cyber crime happend in kadapa district
cyber crime happend in kadapa districtcyber crime happend in kadapa district

By

Published : May 28, 2020, 11:24 PM IST

Updated : May 29, 2020, 10:54 AM IST

కడపకు చెందిన కిషోర్ కుమార్ పాస్టర్. కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి రోజ్ విలియం అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్​తో పాటు సమాచారం వచ్చింది. మీ చర్చికి కానుక ఇవ్వాలి అనుకుంటున్నానని రెండు రోజుల్లో మీకు ఒక పార్సిల్ వస్తుందని చెప్పాడు. పార్సిల్ ఇచ్చేవారు చెప్పినట్లు చేయాలని తెలిపాడు. పార్సిల్​లో విదేశీ కరెన్సి ఉందని.. 40వేల బ్రిటిష్​ పౌండ్లని భారత్​ కరెన్సీ ప్రకారం...35 లక్షలకు రూపాయలకుపైగానే ఉంటుందని చెప్పాడు. ఇది దేవుని కానుక వదులుకోవద్దు అని సూచించాడు. ఇండియన్ కరెన్సీగా మారాలంటే కొంత డబ్బులు చెల్లించాలని కిషోర్​ కుమార్​ను నమ్మించాడు. దేవుడు పంపే కానుక అని చెప్పే సరికి.. నాలుగు విడతలుగా 12 లక్షల 85 వేల రూపాయలను పాస్టర్ డిపాజిట్ చేశాడు. తర్వాత తెలిసింది మోసపోయానని. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : May 29, 2020, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details