కడప జిల్లా బద్వేలులో రైతులు భయం గుప్పిట బతుకుతున్నారు. తమ పొలాల్లో ఒరిగిపోయి ఉన్న విద్యుత్ స్తంభాలు.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. కరెంటు తీగలు తమకు తగిలేంతగా వేలాడుతున్నాయని వాపోయారు. వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా... ఇబ్బందులు తప్పటంలేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ప్రమాదకరంగా స్తంభాలు... రైతులను కాపాడేదెవరు? - badvel
కడప జిల్లాలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. పొలాల్లో ఒరిగిపోయి ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కరెంట్ స్తంభాలు