బద్వేలులోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ కారణంగా ప్రభుత్వ సేవలు స్తంభించాయి. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ శాఖ అధికారులు కరెంటు కట్ చేశారు. అనేక పర్యాయాలు బిల్లులు చెల్లించమని ఆ శాఖల అధికారులను కోరినా స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక సరఫరాను ఆపేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంట్ కట్...బకాయిలే కారణం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
బద్వేలులోని సబ్ రిజిస్టర్, తహసీల్దార్, నీటి పారుదల తదితర ప్రభుత్వ శాఖ కార్యాలయాల విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అధికారులకు పలుమార్లు చెప్పినా స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
స్తంభించిన ప్రభుత్వ సేవలు