కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ మొదలైంది. ఆర్టీసీ బస్సులను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నడిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులను పూర్తిగా నిలిపేశారు. సుదూర ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఆరు గంటల వ్యవధిలోనే బస్సులను తిప్పారు. జిల్లా సరిహద్దుల వరకు మాత్రమే బస్సులను నడిపారు. 12 గంటల లోపు బస్సులన్నీ తిరిగి గ్యారేజీకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్లో గంట ముందే బస్సు సర్వీసులు అన్నింటినీ నిలిపేశారు. గంట ముందే బస్సు సర్వీసులు నిలిపివేయడంతో చాలామంది ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా డైట్ పరీక్షకు వెళ్లిన విద్యార్థులు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
అమల్లోకి ఆంక్షలు.. డిపోలకే పరిమితమైన బస్సులు - corona cases at kadapa
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కడప జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నడిపారు.
curfew at kadapa district