కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి.... జిల్లాలోని పేద రోగులకు పెద్దదిక్కు. అలాంటి రోగులకు ఇదే పెద్దాసుపత్రి. జిల్లా నలుమూలల నుంచి వైద్యసేవలు పొందేందుకు ఇక్కడేక వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న జిల్లా సర్కారు ఆసుపత్రిలో రెండేళ్లుగా వైద్యసేవల్లో ఎంతో కీలకమైన సీటీ స్కాన్ యంత్రం మూలకు చేరడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో చేసేదిలేక రూ.వేలల్లో అప్పులు చేసి ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
రిమ్స్‌లో 2010లో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో రోజుకు 10 నుంచి 15 మంది సీటీ స్కాన్ చేయించుకునేందుకు వచ్చేవారు. అనంతరం ఓపీ సేవలు బాగా మెరుగుపడడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి స్కానింగ్ చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడ రోజుకు 20 నుంచి 35 వరకు సీటీ స్కానింగ్‌లు జరిగేవి. నాలుగేళ్లపాటు ఎలాంటి అంతరాయం లేకుడా యంత్రం సేవలందించింది. అనంతరం తరచూ మరమ్మతులకు గురవుతుండడం, అధికారులు మరమ్మతులు చేయించడం తరచూ జరుగుతుండేది. రెండేళ్ల కిందట యంత్రం పూర్తిగా మొరాయించగా, పరిశీలించిన సాంకేతిక నిపుణులు యంత్రానికి మరమ్మతులు చేసినా ఫలితం ఉండదని తేల్చి చప్పెడంతో మూలన పడేశారు. సీటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సీటీ స్కాన్ పరీక్షలకు డిమాండు పరెగడంతో .పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంతమంది అప్పులు చేసి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది ఆర్థిక స్థోమత లేక, గత్యంతరం లేక వైద్యులిచ్చిన మందులతో కాలం వెళ్లదీస్తున్నారు.
చెస్ట్, అబ్డామిన్ స్కాన్లు అధికం
సాధారణ, చెస్ట్, అబ్డామిన్ సమస్యలతో బాధపడేవారు, శస్త్రచికిత్సలు చేయించుకునేవారికి సీటీ స్కాన్ తప్పనిసరి. లేకుంటే శస్త్రచికిత్సలు చేయరు. ఇలాంటి సమస్యలతో సర్వజన ఆసుపత్రికి రోజుకు దాదాపు 20 నుంచి 30 మంది దాకా వస్తుంటారు. వీరందరూ కూడా సీటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తూ చీటీలు రాస్తున్నారు.
అధిక వసూళ్లు
సాధారణ జ్వరం, జలుబు వచ్చినా సీటీ స్కానింగ్ చేయించాలి లేదా కొవిడ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దాసుపత్రిని నమ్ముకుని జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది పేదలు ఇక్కడికి సీటీ స్కానింగ్‌కు వస్తుంటారు. అయితే యంత్రం అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కడప నగరంలో 5 సీటీ స్కాన్ కేంద్రాలున్నాయి. ఇక్కడకు వచ్చేవారి నుంచి రూ.5 వేలు నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.
రోజుకు 20 మందికి పైనే...