ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూగుల్ పే ద్వారా ఆరోగ్యశ్రీ డబ్బులు.. బావ, బామ్మర్ధులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ - ఏపీ వార్తలు

Crimes and Accidents in AP: మీకు ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వస్తాయి. మీ ఫోన్​లో వేస్తాం. గూగుల్ పే ఓపెన్ చేయండి అంటూ మాట్లాడి.. 72 వేల రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఇక మరో చోట.. రోడ్డు ప్రమాదంలో హెడ్​కానిస్టేబుల్ మృతి చెందారు.

Crimes and Accidents in AP
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు

By

Published : Apr 12, 2023, 9:29 PM IST

Crimes and Accidents in AP: ఇటీవల ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే.. క్షణాల వ్యవధిలో దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని గరుగు వీధికి చెందిన గుడిపాడు పీరయ్య అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి గూగుల్ పే ద్వారా 72 వేల 990 రూపాయలు నగదు కాజేశారు.

మీ బామ్మర్ది చెప్పాడు.. ఆరోగ్యశ్రీ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం.. అని చెప్పి నమ్మించి మోసం చేశారని బాధితుడు వాపోయాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఆ సైబర్ నేరగాళ్లు.. బాధితుడి బామ్మర్దికి కూడా ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆ మాటలు నమ్మిన బాధితుడు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు.

డబ్బు పోయిన విషయాన్ని తొందరగా గ్రహించి స్థానిక వేంపల్లి ఎస్బీఐ బ్యాంకులో సంప్రదించానన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరాల గురించి పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ చదువుకున్న వాళ్లు.. చదువు రాని వాళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు.

హెడ్​కానిస్టేబుల్ మృతి: గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం నుదురుపాడు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ ఆటో ఢీ కొట్టడంతో.. హెడ్ కానిస్టేబుల్ తాళ్లూరి సూర్యనారాయణ(50) తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సూర్యనారాయణ పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా నరసరావుపేట నుంచి గుంటూరు బయలు దేరి వెళ్లున్న సమయంలో ప్రమాదం జరిగింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని గణపవరం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జి కొండూరు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన కూరపాటి అనిల్​గా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సెల్ టవర్​లో మంటలు: కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామ సమీపంలో సెల్ టవర్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదవశాత్తు సెల్ టవర్లో మంటలు చెలరేగాయని గ్రామస్థులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details