కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంసాగర్ జలాశయం ఎడమ కాల్వ వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 80, 200 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని సోమిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డితోపాటు మరో ఆరుగురు బెట్టింగ్ ఆడుతుండగా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆడే వారిపై సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యాంగా ఉంచుతామన్నారు. యువత వ్యసనాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'యువత వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులే జాగ్రత్త తీసుకోవాలి' - Cricket bookies arrested bt the kadapa police news update
క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఏడుగురిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ఆడేవారిపై సమాచారం ఇవ్వాలని కోరారు.
క్రికెట్ బుకీలు అరెస్టు