బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులని భాజపా ఎంపీ అనడం దారుణమని సీపీఎం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ... కడప జిల్లా సీపీఎం కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
భాజపాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసింది భాజపా అని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించింది భాజపా కాదా అని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆస్తులను కాజేసింది భాజపా నాయకులని పేర్కొన్నారు.