యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం మధు పర్యటన
యురేనియం ప్రభావిత గ్రామాల్లో సీపీఎం నేత మధు పర్యటించారు. ప్రభుత్వం కర్మాగారాన్ని తక్షణమే మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తిరగబడి మూసేస్తారని హెచ్చరించారు.
cpi
ప్రభుత్వం యురేనియం కర్మాగారాన్ని మూసేయకపోతే... ప్రజలే తిరగబడి మూసేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. కడప జిల్లా వేముల మండలంలో... యురేనియం కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పర్యటించారు. యురేనియం తవ్వకాల వల్ల... నీరు, గాలి కలుషితమవుతున్నాయని చెప్పారు. మంత్రులు, గవర్నర్ చొరవ తీసుకుని... దీన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కడపలో ఉన్న అన్ని ప్రజాసంఘాలతో కలసి కర్మాగారం మూతపడేవరకూ పోరాటం చేస్తామని మధు తెలిపారు.