ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీ దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వండి: సీపీఎం - కడపలో సీపీఎం నిరసన

టీ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కడపలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. వాటి మీద ఆధారపడి ఎంతో మంది బతుకున్నారని.. లాక్ డౌన్ వలన ఇప్పటికే ఎంతో నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా అనుమతి ఇస్తే వారి కష్టాలు తీరతాయని చెప్పారు.

cpm leaders protest in kadapa
కడపలో సీపీఎం నాయకుల ధర్నా

By

Published : Jul 12, 2020, 12:40 PM IST

లాక్​డౌన్ ఆంక్షల సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. టీ దుకాణాలకు ఎందుకు ఇవ్వలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. కడపలో తేనీరు దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నగరంలో దాదాపు 4 వేల మంది ఛాయ్ దుకాణాలు పెట్టుకుని బతుకుతున్నారన్నారు. అవి తెరుచుకునేందుకు అనుమతిస్తే వారి జీవనానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు టీ దుకాణాలకు ఎందుకివ్వరని నిలదీశారు. వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details