కరోన బాధితుల పట్ల ముఖ్యమంత్రి చెబుతున్న దానికి భిన్నంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని మండల అధికారులు వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.శివకుమార్ ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ బ్రహ్మంగారిమఠం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కరోనా కేసులు లేని మండలంగా బి.మఠం ఉండేదన్నారు.
బ్రహ్మంగారిమఠం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నేతల ధర్నా - బి.మఠం తహసీల్ధార్ కార్యాలయం ఎదుట సీపీఎంనేతల ధర్నా
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు ధర్నా చేశారు. కరోనా బాధితుల పట్ల సీఎం చెబుతున్న వ్యాఖ్యలకు భిన్నంగా మండలంలోని అధికారుల తీరు ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.శివకుమార్ ఆరోపించారు.
బ్రహ్మంగారిమఠం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు ఆందోళన
కరోనా పాజిటివ్ కేసు నమోదైతే విస్తరించకుండా కుటుంబసభ్యులను క్వారంటైన్లో ఉంచాలని, బాధితున్ని కోవిడ్ ఆసుపత్రికి తరలించి, చుట్టుప్రక్కల వారిని జాగ్రత్త పరచాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారానికోసారి మండల కేంద్రంలో పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇవీ చదవండి